స్టార్ యాంకర్ ప్రదీప్ నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది మేల్ యాంకర్స్ లో నెంబర్ వన్ ప్రదీప్ మాచిరాజు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన. వరస రియాలిటీ షోలతో పాటు ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు ప్రదీప్. కొన్నేళ్లుగా సినిమాల్లో చిన్న రోల్స్ చేసినా కూడా 2020లో హీరోగా కూడా మారిపోయాడు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అంటూ హీరో అయిపోయాడు ఈయన. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు మరిన్ని కథలు కూడా వింటున్నాడు ప్రదీప్. హీరోగా నటిస్తున్నా కూడా బుల్లితెరపై మాత్రం బిజీగానే ఉంటాడు ప్రదీప్. రోజూ టీవీలో కనిపిస్తూనే ఉంటాడు ఈయన. దాంతో ప్రదీప్ అసలు నెలకు ఎంత సంపాదిస్తాడు అనేది కొందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.
ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తుంటే ఈయన నెల ఆదాయం దాదాపు 50 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. రెండేళ్ల కింద లెక్కల ప్రకారం చూసుకున్నపుడే దాదాపు 35 లక్షల వరకు సంపాదిస్తున్నాడని కథనాలు వచ్చాయి. ఢీ లాంటి షోలలో ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు 1.25 లక్షలకు పైగానే తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. రెండేళ్ల కింద ఎపిసోడ్‌కు దాదాపు 75 వేల వరకు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈయన మార్కెట్ కూడా పెరగడంతో లక్ష పాతిక వేలకు చేరిందని తెలుస్తుంది. దాంతో పాటు మిగిలిన షోలకు కూడా అంతే తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈయన చేతినిండా షోలతో బిజీగా ఉన్నాడు. ఢీ, జీ సరిగమప సహా మరికొన్ని షోలు కూడా చేస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు.
దాంతో పాటు మిగిలిన ఛానెల్స్ లో కూడా భారీగానే షోలు చేస్తున్నాడు. డైలీ షోలతో పాటు వీక్లీ ఎపిసోడ్స్ కూడా చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈయన చేస్తున్న షోలు.. రియాలిటీ ఎపిసోడ్స్ అన్నీ కలిపి 50 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడని తెలుస్తుంది. నెలలో అన్ని రోజులు ఈయన బిజీగానే ఉంటున్నాడు కూడా. మరోవైపు సినిమాల కోసం కూడా భారీగానే అందుకుంటున్నాడు ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా కోసం కూడా దాదాపు 30 లక్షల వరకు పారితోషికం తీసుకున్నాడని వార్తలొస్తున్నాయి. ఏదేమైనా కూడా ప్రదీప్ మాచిరాజు మాత్రం బుల్లితెర యాంకర్స్‌లో టాప్‌లో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
అఖిల్ కోసం హైదరాబాద్ లోనే మోనాల్..!
సారా అలీఖాన్ ను పక్కన పెట్టేశారు..కారణం తెలిసి షాక్..!
బిగ్ బాస్‌లో రీ యూనియన్.. పండగ చేసుకున్న కంటెస్టెంట్స్
డ్రగ్స్ కేసు: బడా ప్రొడ్యూసర్‌కు సమన్లు జారీ
గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు : హథ్రాస్‌పై సీబీఐ
ఉమేశ్ అదుర్స్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
వరుణ ధవన్' ను చూడండి..సారా ఫన్నీ వీడియో
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మతసామరస్యానికి ప్రతీకగా ఉర్సు
- పాలమూరు కోడలిని ఆశీర్వదించండి
- ‘ప్రగతి’ పనుల్లో జిల్లా ముందుండాలి
- విరాట్ @100 మిలియన్ల ఫాలోవర్స్
- బెంగాల్ మంత్రుల కోడ్ ఉల్లంఘన: ఈసీకి బీజేపీ లేఖ
- బెంగాల్ పొత్తులు నెహ్రూ-గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం
- ఎన్ఎస్ఈలో లోపం అనూహ్యం.. బట్!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల బిడ్లు!