మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 12, 2021 , 18:07:21

సింగర్ సునీత పెళ్లి గిఫ్టుల విలువ ఎంతో తెలుసా..?

సింగర్ సునీత పెళ్లి గిఫ్టుల విలువ ఎంతో తెలుసా..?

సాధారణంగా పెళ్లి జరిగినపుడు వధూవరులతోపాటు వంటల గురించి కూడా మాట్లాడుకుంటారు. దాంతోపాటే మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంటుంది. కాకపోతే అది బయటికి అడగటానికి మాత్రం కాస్త మోహమాటపడుతుంటారు. అదే కట్నం..దాంతో పాటు వచ్చే కానకులు. కట్నం గురించి చాలా మంది ఓపెన్ కాలేరు కానీ వచ్చే కానుకల విలువ మాత్రం బయటికి తెలిసిపోతుంది. మొన్నటికి మొన్న నిహారిక పెళ్లికి దాదాపు 11 కోట్ల విలువైన గిఫ్టులు వచ్చాయని అప్పట్లో భారీగానే ప్రచారం జరిగింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మరో పెళ్లి బాజా కూడా మోగింది. 

సింగర్ సునీత మనసుకు నచ్చిన రామ్ వీరపనేనితో ఏడడుగులు నడిచింది సునీత. 19 ఏళ్ళకే పెళ్లి చేసుకుని..కొన్నేళ్ళ తర్వాత మొదటి భర్త తీరుతో విడిపోయి గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉన్న సునీత.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. దీనిపై కొందరు విమర్శలు చేసినా చాలా మంది ఆమెకు అండగా నిలిచారు. ఇదిలా ఉంటే సునీత పెళ్లికి చాలా కాస్ట్ లీ గిఫ్టులు వచ్చాయి. ఈమె పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు రామ్ వీరపనేనికి సన్నిహితులు అయిన రాజకీయ ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. 

దాంతో వాళ్లు వీళ్లు ఖరీదైన బహుమతులే ఇచ్చారని తెలుస్తుంది. అందులో మరీ ముఖ్యంగా యాంకర్ సుమ తన ప్రాణ స్నేహితురాలి కోసం ఏకంగా 11 లక్షలు పెట్టి ఓ నెక్లెస్ చేయించిందని తెలుస్తుంది. ఈ నెక్లెస్ గురించి పెళ్లిలో కూడా బాగానే చర్చ జరిగిందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే నితిన్ కూడా సునీతకు మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈయన సునీతతో పాటు రామ్ కు కూడా సన్నిహితుడే. దాంతో లక్షల్లో విలువ చేసే గిఫ్ట్ నితిన్ తీసుకొచ్చాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇక ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా సునీత పెళ్లికి భారీ బహుమతి ఇచ్చాడు. దీని విలువ కూడా లక్షల్లోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

వాళ్లు మాత్రమే కాదు సునీత సన్నిహితులు యాంకర్ ఝాన్సీ, నటి అనితా చౌదరి కూడా స్నేహితురాలి కోసం కాస్ట్ లీ గిఫ్టులు తీసుకొచ్చారు. అన్నీ కలిపితే దాదాపు 1.5 కోట్ల వరకు సునీత పెళ్లికి గిఫ్టులు వచ్చినట్లు తెలుస్తుంది. జనవరి 9న శంషాబాద్ సమీపంలో అమ్మపల్లి సీతారామ చంద్రస్వామి ఆలయంలో జరిగింది. ఏదేమైనా కూడా పెళ్లి మాత్రమే కాదు గిఫ్టులు కూడా ఘనంగానే వచ్చాయని అంతా చెవులు కొరుక్కుంటున్నారిప్పుడు.

ఇవి కూడా చ‌ద‌వండి

ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీకి సాయిప‌ల్ల‌వి గ్రీన్‌సిగ్న‌ల్‌..!

రాంచ‌రణ్ కు నెగెటివ్‌..త్వ‌రలోనే షూటింగ్‌

స్మిమ్మింగ్ రాదు..కాని స్విమ్మ‌ర్ గా న‌టించా: న‌భాన‌టేశ్‌

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo