పెట్ డాగ్స్ కొన్నిసార్లు ఎలాంటి చిలిపి పనులు చేస్తాయో చెప్పనవసరం లేదు. అయితే పప్పీ డాగ్స్ యజమాని నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాయి. మరి రష్మిక మందన్నా క్యూట్ పెట్ ‘ఆరా’కు ఇష్టమైంది ఒకటుంది. అదేంటనేది తెలియజేస్తూ రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు, వీడియోను పోస్ట్ చేసింది. ‘ఆరా’ రష్మిక కంటిపాపపై ఉన్న హెయిర్ ను, తల వెంట్రుకలను ఛీవ్ టాయ్లాగే నమలడం చూడొచ్చు. ఆరాకు నా కంటిపాపపై ఉన్న హెయిర్ ను నమలడం ఛీవ్ స్టిక్స్ ను తినడం కన్నా మరింత ఎక్జయిటింగ్ గా ఉంది. యాయ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది రష్మిక.
చాలా ముద్దుగా ఉందంటూ నటి ఎల్లి ఎవ్రామ్ కామెంట్ పెట్టింది. రష్మిక లాక్డౌన్ పీరియడ్లో ఆరాను దత్తత తీసుకుంది. హాయ్..ఇప్పుడున్న ఆందోళనకర పరిస్థితుల్లో నా ఆనందాన్ని కనుగొన్నాను. నా లిటిల్ వన్ ఆరాను మీకు పరిచయం చేస్తున్నానంటూ..క్యూట్ పెట్ ఆరాను సోషల్ మీడియా ద్వారా అందరికీ ఇంట్రడ్యూస్ చేసింది రష్మిక. ఆరా వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక ఫన్ స్టిల్ షేర్ చేసుకుంటుంది.
ఇవి కూడా చదవండి..
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!