బుధవారం 27 జనవరి 2021
Cinema - Nov 07, 2020 , 17:51:38

ప్రభాస్‌ ప్రైవేట్ ఫ్లైట్ కథ తెలుసా.. ఎక్కడికి వెళ్లినా దాంట్లోనే!

ప్రభాస్‌ ప్రైవేట్ ఫ్లైట్ కథ తెలుసా.. ఎక్కడికి వెళ్లినా దాంట్లోనే!

ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా విళయతాండవం చేస్తుంది. కొన్ని దేశాల్లో అయితే ఏకంగా రెండో దశ కూడా మొదలైపోయింది. దాంతో అడుగు బయటపెట్టడం అంటే ప్రమాదానికి షేక్ హ్యాండ్ ఇవ్వడమే అవుతుంది. అందుకే షూటింగ్ విషయంలో కూడా ఆలోచనలో పడిపోతున్నారు దర్శక నిర్మాతలు. స్టార్ హీరోలతో పాటు మిగిలిన స్టాఫ్ అందర్నీ షూటింగ్ కు తీసుకొచ్చినపుడు వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్లపైనే ఉంటుంది. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా మాత్రం అటాక్ చేస్తూనే ఉంది. అందుకే ప్రభాస్ తన జాగ్రత్తలో తానున్నాడు. ముఖ్యంగా షూటింగ్ కు వెళ్లినపుడు జనంతో కలవకుండా ఉండటానికి ప్లాన్ చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఫారెన్ కు షూట్ కోసం వెళ్లినపుడు ఫ్లైట్ జర్నీ అనేది చాలా సమస్యగా మారుతుంది. 

అందరితో కలిసి ప్రయాణం చేసినపుడు కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రభాస్ ఓ ప్రైవేట్ ఫ్లైట్ ను తెచ్చుకున్నాడు. ఈ మధ్య రాధే శ్యామ్ కోసం ఇటలీ వెళ్లాడు ప్రభాస్. వచ్చేటప్పుడు తన ఫ్లైట్ లోనే వచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతీసారి జనాల్లోకి వెళ్లి షూటింగ్ చేసుకోవాలన్నా.. గుంపులు గుంపులుగా ఫ్లైట్ జర్నీ చేయాలన్నా సమస్యగానే ఉంటుంది. అందుకే తన ఎన్నారై ఫ్రెండ్ ను అడిగి అతడి ఫ్లైట్ వాడుకుంటున్నాడు ప్రభాస్. మొన్నటికి మొన్న ఇటలీ నుంచి రావడానికి కూడా ఈ ప్రైవేట్ ఫ్లైట్ నే వాడుకున్నాడు ఈయన. దాంతో పాటు ముంబై వెళ్లి ఆదిపురుష్ సినిమా గురించి చర్చిండానికి కూడా ఈ ప్రైవేట్ ఫ్లైట్ నే తీసుకెళ్లాడు. 

ఇతర దేశాల్లో షూటింగ్ చేయాలంటే కూడా ఇప్పుడు తనకు ఇదే ఆధారం. ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా కూడా ఫ్లైట్ తప్ప మరో మాటే మాట్లాడటం లేదు ప్రభాస్. అందుకే ముంబైకి వెళ్లి ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్‌తో చర్చించి వచ్చాడు. తన NRI ఫ్రెండ్‌తో ఉన్న అనుబంధంతో ఈ ఫ్లైట్ తన దగ్గరే కొన్నాళ్లు ఉంచుకోనున్నాడు ఈయన. ప్రస్తుతం రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. కరోనా ఉన్నా కూడా ధైర్యంగానే తన సినిమాలను పూర్తి చేస్తున్నాడు ఈయన.


logo