శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 17:29:38

కొత్త సినిమాల‌కు ప్ర‌భాస్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

కొత్త సినిమాల‌కు ప్ర‌భాస్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

బాహుబ‌లి ప్రాంఛైజీ త‌ర్వాత ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ సంపాదించాడు టాలీవుడ్ న‌టుడు ప్ర‌భాస్‌. ఈ సినిమాతో పెద్ద పెద్ద ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌భాస్ తో సినిమా చేసేందుకు క్యూ క‌డుతున్నారు. బాహుబ‌లి, బాహుబలి 2 త‌ర్వాత విరామం తీసుకున్న ప్ర‌భాస్..ఇపుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో సందడి షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. రాధేశ్యామ్‌, ఆదిపురుష్ చిత్రాల‌తోపాటు నాగ్ అశ్విన్ తో సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. మ‌రోవైపు కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో సినిమాను ఓకే చేశాడు.

ఇలా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్న ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకుంటున్నాడ‌నే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూడు సినిమాల‌కు ప్ర‌భాస్ రూ.300 కోట్లు పారితోషికం తీసుకుంటున్న‌ట్టు జోరుగా చ‌ర్చ‌న‌డుస్తోంది. కొన్ని ప్రాజెక్టుల‌కు వ‌చ్చిన లాభాల్లో 10శాతం తీసుకునేలా ప్లాన్ చేశాడ‌ట‌. మొత్తానికి ప్ర‌భాస్ స‌రాస‌రి మూడు సినిమాల‌కు రూ.75 కోట్ల చొప్పున రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు టాక్‌. ప్ర‌శాంత్‌నీల్ డైరెక్ష‌న్ లో రానున్న పాన్ ఇండియా స్టోరీకి ప్ర‌భాస్ రూ.100కోట్లు పారితోషికం తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.