సూర్య కెరీర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా గజిని ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అప్పటి వరకు ఈయనకు కొన్ని విజయాలు వచ్చాయి.. కానీ స్టార్ హీరో కాలేదు. 2005కు ముందు రెండు మూడు సూపర్ హిట్లు కూడా అందుకున్నాడు సూర్య. అయినా కూడా మార్కెట్ పెద్దగా తెచ్చుకోలేకపోయాడు. అలాంటి సమయంలో ఈయన కెరీర్ మలుపుతిప్పిన సినిమా ఒకటి వచ్చింది. దాని పేరు గజినీ.. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాను తిరుగులేని విధంగా తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందించాడు.
గజిని సినిమా చేసిన విధానం చూసిన తర్వాత అమీర్ ఖాన్ ఆసక్తి చూపించి హిందీలో రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమాని మురుగదాస్ తెరకెక్కించాడు. ఇండియాలో 100 కోట్ల షేర్ అందుకున్న తొలి సినిమా హిందీ గజినీ. ఇంతటి చరిత్ర సృష్టించిన సినిమాను 12 మంది హీరోలు కాదన్నారు అని తెలిస్తే నిజంగానే షాక్ తప్పదు. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. గజిని సినిమా కథ సూర్య కంటే ముందు దాదాపు 10 మంది హీరోలకు చెప్పాడు మురుగదాస్. తన తొలి సినిమా దీన హీరో అజిత్ కు ముందుగా ఈ సినిమా కథ చెప్పాడు. కానీ ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు.
అజిత్ తర్వాత విజయ్, విక్రమ్ లాంటి హీరోలకు కూడా గజినీ కథ చెప్పాడు మురుగదాస్. చాలామంది హీరోలకు గజిని సినిమా కథ నచ్చినా కూడా అందులో చాలా భాగం హీరో గుండు కొట్టించుకుని ఉండడం.. అలాగే డీ గ్లామర్ పాత్ర ఉండడంతో రిస్క్ తీసుకోలేదు. అలా చాలా మంది హీరోలు కాదన్న తర్వాత సూర్యకు చెప్పాడు మురుగదాస్. ఈయనకు తొలి నెరేషన్ లోనే కథ నచ్చింది. గుండు కొట్టించడానికి కూడా సిద్ధమయ్యాడు. అనుకున్నట్లుగానే ప్రమోషన్ మొదలైంది. మొదట్లో విడుదలైన పోస్టర్స్ లోనే గుండుతో కనిపించాడు సూర్య.
హీరోయిన్స్ గా ఆసిన్, శ్రీయను అనుకున్నాడు మురుగదాస్. అయితే శ్రీయ బిజీగా ఉండటంతో నయనతార పాత్ర చేసింది. మరోవైపు సినిమాలో అత్యంత కీలకమైన విలన్ ప్రదీప్ రావత్ క్యారెక్టర్ కోసం ముందు ప్రకాష్ రాజ్ ను అనుకున్నాడు మురుగదాస్. కానీ ఆయన డేట్స్ కుదరక పోవడంతో ఈ క్యారెక్టర్ ప్రదీప్ రావత్ కి వెళ్ళింది. మొత్తానికి భారీ అంచనాల మధ్య 2005లో విడుదలైన గజిని సంచలన విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ విడుదల చేశాడు. ఇక్కడ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన గజిని..దాదాపు 11 కోట్ల షేర్ వసూలు చేసింది. కథ నచ్చినా కూడా చాలా మంది హీరోలు రిస్క్ తీసుకోలేకపోయారు.
ఇవి కూడా చదవండి..
రాజమౌళి కథ చెప్తే..పవన్ కల్యాణ్ ఏమన్నాడంటే..?
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
Recommended Content by ntnews.com