బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 27, 2021 , 20:11:01

పెళ్లికి ముందు చైతూ కోసం సమంత ఎంత పెద్ద ప్లాన్ చేసిందో తెలుసా..?

పెళ్లికి ముందు చైతూ కోసం సమంత ఎంత పెద్ద ప్లాన్ చేసిందో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్స్‌లో సమంత, నాగ చైతన్య కూడా ఉంటారు. నాలుగేళ్ళ కాపురం.. ఆరేళ్ళ ప్రేమ.. పదేళ్ల పరిచయం.. ఇదీ వీళ్ళ హిస్టరీ. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్యతో పెళ్లికి ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది సమంత అక్కినేని. ఈమె అక్కినేని కోడలు కాకముందు చైతూతో ప్రేమలో పడిన తర్వాత చేసిన కొన్ని పనుల గురించి ఇప్పుడు గుర్తు చేసుకుంది సమంత. తాజాగా ఈమె ఓ తమిళ సినిమాలో నటిస్తుంది. దీనికి సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. అందుకే అక్కడికి వెళ్లింది స్యామ్. చాలా రోజుల తర్వాత సొంత రాష్ట్రానికి వెళ్లడంతో ఎమోషనల్ అయిపోయింది సమంత. అక్కడ మనుషులు చూడగానే.. మాతృభాష మాట్లాడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది స్యామ్. 

అంతేకాదు తల్లిదండ్రులను కలవడం..స్నేహితులతో టైమ్ స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ తనకు చాలా అంటే చాలా బాగా అనిపించాయని చెప్పింది ఈ భామ. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఇందులోనే చాలా విషయాల గురించి చెప్పుకొచ్చింది సమంత. అప్పుడే తన ప్రేమ గురించి.. పెళ్లి గురించి కూడా ఓపెన్ అయిపోయింది. ఎందుకు చైతన్య బయటికి రాడు.. మీలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు అంటూ అభిమానులు అడిగితే అది అందరం కలిసి చైనే అడుగుదాం అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఇదిలా ఉంటే జిమ్ లో ఎప్పుడూ ఉంటారు.. ఎక్కువ సమయం గడిపేస్తుంటారు.. ఏంటి అంత ఫిట్ నెస్ ఫ్రీక్ అంటూ అడిగాడు యాంకర్. దానికి కూడా ఆసక్తికరమైన సమాధానం చెప్పింది సమంత. 

నిజానికి జిమ్ గురించి చెప్పినపుడు మరో రహస్యం కూడా చెప్పింది. తాను జిమ్ లో గడపడం గురించి పక్కనబెడితే.. అసలు విషయం ఏంటంటే అప్పట్లో తాను జిమ్ కు వెళ్లిందే చైతూ కోసమని సంచలన నిజం బయట పెట్టింది. పెళ్లికి ముందు కేవలం చైతూతో సమయం గడపటానికి.. అతడితో ముచ్చట్లు చెప్పడానికి.. మరింత స్నేహం పెంచుకోడానికి మాత్రమే జిమ్ కు వెళ్లేదాన్ని అంటూ చెప్పింది సమంత అక్కినేని. అలా పెరిగిన తమ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు ఒక్కటయ్యామని చెప్పింది స్యామ్. 

ఏదేమైనా కూడా చైతూ కోసం పెళ్లికి ముందు అక్కినేని కోడలు కావడానికి చాలా పెద్ద ప్లాన్ చేసింది సమంత. ఇదంతా సమంత చెప్పిన తర్వాత అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏవీ చేయడం లేదు కానీ తమిళంలో ఒక సినిమా చేస్తుంది. అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ 2లో కూడా నటించింది సమంత. ఇందులో టెర్రరిస్ట్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఫిబ్రవరి 12న ఇది అమెజాన్ లో స్ట్రీమ్ కానుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

‘ఓటిటి’ కాలం మొద‌లైన‌ట్టేనా..?

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo