మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 31, 2020 , 18:13:49

జంగ్లీ సినిమా ఎలిఫెంట్ సాంక్చుయ‌రీ లొకేష‌న్ ఇదే..!

జంగ్లీ సినిమా ఎలిఫెంట్ సాంక్చుయ‌రీ లొకేష‌న్ ఇదే..!

జంగ్లీ..2019లో వ‌చ్చిన యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ చిత్రం. బాలీవుడ్ న‌టుడు విద్యుత్ జ‌మ్వాల్ లీడ్ రోల్ లో న‌టించాడు. ఎలిఫెంట్ రిజ‌ర్వ్ లో జ‌రిగే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. ఓ వెట‌ర్నరీ డాక్ట‌ర్ త‌న తండ్రి ఉండే ఎలిఫెంట్ రిజ‌ర్వ్ కు తిరిగొస్తాడు. ఏనుగుల‌ను వేటాడే అంత‌ర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్ ను ఎదుర్కొనే క్ర‌మంలో ఈ మూవీలో విద్యుత్ జ‌మ్వాల్ చేసే యాక్ష‌న్ స్టంట్స్ అంద‌రినీ క‌ట్టిప‌డేస్తాయి. ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ఫిలిం లొకేష‌న్ గురించి ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే. 

సినిమాలో క‌నిపించే ఎలిఫెంట్ టైగ‌ర్ రిజ‌ర్వ్ థాయ్ లాండ్ కు చెందిన‌ది. ఎలిఫెంట్ న్యాచుర్ సాంక్యుయ‌రీ లో సినిమాలోని ఎక్కువ భాగం చిత్రీక‌రించారు.  చియాంగ్ మై ప్రాంతానికి 60కిలో మీట‌ర్ల దూరంలో ఈ సాంక్యుయ‌రీ ఉంది. చియాంగ్ మై వాసులు, గిరిజ‌నులు సంయుక్తంగా ఈ ఎలిఫెంట్ సాంక్చుయ‌రీని ఏర్పాటు చేయ‌డం విశేషం. ఇక్క‌డి ఏనుగులు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇచ్చిన‌వి. ఈ సాంక్చుయ‌రీలో సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి ఉంది. ఏనుగుల‌తో సంద‌ర్శ‌కులు ఇంట‌రాక్ట్ అవ్వొచ్చు. సాంక్చుయ‌రీ గురించి ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుసుకోవచ్చు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo