సిద్ధ్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్ర ‘డీజే టిల్లు’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విమల్‌కృష్ణ దర్శకుడు. టీజర్‌ను ఆదివారం చిత్రబృందం విడుదలచేసింది. తెలంగాణ యాసలో సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన సంభాషణలతో ఆద్యంతం వినోదభరితంగా సాగింది. ‘డీజేగా నువ్వు ఏ క్లబ్లో మ్యూజిక్ ప్లే చేస్తావు’ అని నాయిక అడిగిన ప్రశ్నకు ‘మనం అంతా మాంకాలమ్మ జాతర, బోనాల పండుగ, సారి ఫంక్షన్స్ స్క్రాచ్ ఉంటది మొత్తం’ అంటూ సిద్ధు చెప్పిన డైలాగ్ నవ్వుల్ని పంచుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. డీజే టిల్లు అనే యువకుడి కథ ఇది. అతడి ప్రేమకథకు ఎదురైన ఇబ్బందులు ఆసక్తిని పంచుతాయి. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని తెలిపారు.