సోమవారం 25 మే 2020
Cinema - Mar 18, 2020 , 09:54:10

నెటిజ‌న్స్‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన దివ్యాంక‌

నెటిజ‌న్స్‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన దివ్యాంక‌

సామాన్య ప్ర‌జ‌ల నుండి సెల‌బ్రిటీల వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. దాదాపు ప్ర‌తి విష‌యాన్ని సోష‌ల్ నెట్‌వ‌ర్క్ సైట్స్‌లో షేర్ చేస్తూ, ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. కాని కొన్ని సంద‌ర్భాల‌లో సెల‌బ్రిటీలు అత్యుత్సాహంతో చేసే ట్వీట్స్ వ‌ల‌న ఇబ్బందుల‌కి గుర‌వుతున్నారు. తాజాగా న‌టి దివ్యాంక త్రిపాఠి త‌న ట్విట్ట‌ర్‌లో క‌రోనా కార‌ణంగా ముంబైలో ట్రాఫిక్ త‌గ్గింది. మెట్రో, బ్రిడ్జిలు, మృదువైన రోడ్లు నిర్మించేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. దీనిపై స్పందించిన నెటిజ‌న్స్.. ఇంజినీర్స్‌, కార్మికుల జీవితాలు ముఖ్య‌మైన‌వి కావా. వారి జీవితాల‌ని ప‌ణంగా పెట్టి పనులు చేయాలా అని ప్ర‌శ్నించారు.

త‌న త‌ప్పుని తెలుసుకొని ట్వీట్‌ని డిలీట్ చేసిన దివ్యాంక క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. మ‌నమంద‌రం మ‌నుషులం. త‌ప్పులు చేస్తుంటాం. హింసాత్మ‌క‌ సోష‌ల్ మీడియా ప్ర‌పంచంలో ఎవ‌రైన త‌ప్పు చేసిన లేదంటే త‌ప్పు ఒప్పుకున్నా మీరు వారిని క్ష‌మించి ముందుకు సాగ‌లేరా ? ప‌్ర‌తీది ఓ వార్త కావ‌ల‌సిందేనా ? ఇంక మాన‌వ‌త్వం ఎక్క‌డ ఉంది  అని ప్ర‌శ్నించింది దివ్యాంక‌. 2016లో యే హై మొహ‌బ‌తీన్ స్టార్ వివేక్ ద‌హియాని వివాహం చేసుకున్న దివ్యాంక 2017లో న‌చ్‌బ‌లియే టైటిల్ అందుకుంది. 


logo