శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 25, 2020 , 10:20:03

మోనాల్ మ‌ళ్ళీ సేఫ్‌.. ఎలిమినేట‌ర్ ఎవ‌రో క‌న్‌ఫాం చేసిన రాహుల్

మోనాల్ మ‌ళ్ళీ సేఫ్‌.. ఎలిమినేట‌ర్ ఎవ‌రో క‌న్‌ఫాం చేసిన రాహుల్

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఆదివారం ఓ కంటెస్టెంట్ బిగ్ బాస్ గ‌డ‌ప దాటి బ‌య‌ట అడుగుపెడుతూ వ‌స్తున్నారు. సూర్య కిరణ్ (తొలివారం), కరాటే కళ్యాణి (రెండో వారం), దేవి (మూడోవారం), స్వాతి దీక్షిత్ (నాలుగో వారం), సుజాత (ఐదోవారం), గంగవ్వ (ఐదోవారం అనారోగ్యంతో నిష్క్రమించింది), కుమార్ సాయి (ఆరోవారం)  బిగ్ బాస్ హౌజ్‌ని వీడారు. ఇప్పుడు ఏడో వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై అంతటా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. 

ఏడోవారంలో భాగంగా నోయల్, అభిజిత్, అరియానా, అవినాష్, దివి, మోనాల్ గజ్జర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. వీరిలో మోనాల్‌ని పంపించాల‌ని నెటిజన్స్ ప‌ట్టుబ‌ట్టుకు కూర్చున్నారు. గ‌త‌వార‌మే ఆమెను పంపించే ప్ర‌య‌త్న‌మే చేసిన‌ప్ప‌టికీ నిర్వాహ‌కులు మోనాల్‌ని సేవ్ చేసి తిరిగి హౌజ్‌లోకి పంపారు. బిగ్ బాస్ ద‌త్త‌పుత్రిక‌గా మారిన మోనాల్ ఈ వారం కూడా ఎలిమినేట్ కాక‌పోవ‌డంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది.

అయితే దివి ఈ వారం ఎలిమినేట్ అవుతుంద‌ని ఎలా క‌న్‌ఫాం అయింది అంటే..  బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలు చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ త‌న ఫేస్ బుక్‌లో ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ఇందులో ఆయ‌న వెనుక ఉన్న ఫ్రేంస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలిమినేట్ అయిన వారితో పాటు దివి ఫోటో ఉంది.  దీంతో ఈ వారం ఎలిమినేట్ అయింది దివీనే అని, ఆమెను రాహుల్ ఇంట‌ర్వ్యూ చేసి ఉంటాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదీ కాక దివి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో  హార్ట్ బ్రేక్ సింబల్  పోస్ట్ చేయడంతో.. దివి కన్ఫమ్ గా ఎలిమినేట్ అయిందంటున్నారు.