శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 17:00:28

క్రియ‌, డా.ఆనంద్ నేతృత్వంలో ఫిల్మ్ టెక్నిషియ‌న్ల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ

క్రియ‌, డా.ఆనంద్ నేతృత్వంలో ఫిల్మ్ టెక్నిషియ‌న్ల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ

హైద‌రాబాద్ : బ‌ంజారా మ‌హిళా ఎన్జీవో నేడు న‌గ‌రంలోని ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో 60 మంది ఫిల్మ్ టెక్నిషియ‌న్ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేసింది. అమెరికాలో ఉంటున్న వర్ధమాన నటి క్రియ పచ్చిపాల, తన బంజారా మహిళా ఎన్జీవో పేరు మీద స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తున్నారు.  దాదాపు 15 రాష్ట్రాలలో ఉచిత కరోనా సహాయ శిబిరాలను నిర్వహిస్తున్నారు. డైరెక్టర్ డా.ఆనంద్‌తో చేతుల‌మీదుగా ఫిల్మ్ ఛాంబర్‌లో సినీ కార్మికులకు నిత్యావసర స‌రుకుల‌ను నేడు అందజేశారు. ఫిల్మ్ నగర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్య క్రమంలో దర్శకులు ప్రేం రాజ్, ప్రసన్న కుమార్, డా.కాదంబరి కిరణ్ కుమార్, యం ఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.ఆనంద్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపు మేరకు సినీ కార్మికుల కోసం త‌మ‌వంతు చేయూత‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. మంచి మనసుతో సహాయాన్ని అందించిన క్రియ‌ పచ్చిపాలకు ధన్యవాదాలు తెలియజేశారు. 

logo