శనివారం 26 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 10:37:35

దిశ చివ‌రి వీడియో: ఫ‌్రెండ్స్‌తో హ్యాపీగా,జాలీగా..

దిశ చివ‌రి వీడియో: ఫ‌్రెండ్స్‌తో హ్యాపీగా,జాలీగా..

సుశాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంతో పాటు ఆయ‌న‌ మాజీ మేనేజ‌ర్ దిశ సాలియ‌న్ ఆత్మ‌హ‌త్యపై అనేక అనుమానాలు నెలకొన్న సంగ‌తి తెలిసిందే. పోలీసులు ఇద్దరి మృతి విష‌యంలో ప‌లు కోణాల‌లో ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. అయితే దిశ సాలియన్‌ని రేప్ చేసి మ‌ర్డ‌ర్ చేసార‌ని కొంద‌రు త‌మ వాద‌న‌లు వినిపించ‌గా, వాటిని దిశ త‌ల్లిదండ్రులు ఖండించారు. జూన్‌ 9 రాత్రి ముంబైలోని మలద్‌ ప్రాంతంలో దిశ ప్రియుడు రోహాన్‌ నివాసంలో జ‌రిగిన పార్టీలో ఏం జ‌రిగిందా అనేది ఇప్పుడు మిస్ట‌రీగా మారింది.

చ‌నిపోయే ముందు దిశ త‌న ప్రియుడు రోహాన్‌తో పాటు కొంద‌రు ఫ్రెండ్స్‌తో క‌లిసి పార్టీ చేసుకోగా, అందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ వీడియోలో దిశ .. హృతిక్ రోష‌న్ న‌టించిన మిష‌న్ క‌శ్మీర్‌లోని రిండ్ పొష్మ‌ల్ పాట‌కి సంతోషంగా స్టెప్పులేయ‌డం క‌నిపిస్తుంది. మీడియా స‌మాచారం ప్ర‌కారం ఈ వీడియోని దిశ త‌న ఫ్రెండ్స్‌కి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయ‌గా, తాజాగా బ‌య‌ట‌కి వ‌చ్చింది.  


logo