మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 08:30:57

దిశా న‌గ్నంగా లేదు: ముంబై పోలీస్

దిశా న‌గ్నంగా లేదు:  ముంబై పోలీస్

సుశాంత్ మాజీ మేనేజ‌ర్ దిశా సాలియ‌న్ జూన్ 9న భ‌వ‌నంపై నుండి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఆమె మ‌ర‌ణంపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ ప‌లువురు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీనిపై మాల్వాని పోలీస్ స్టేష‌న్‌కి చెందిన పోలీస్ అధికారి ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ పూర్తి క్లారిటీ ఇచ్చారు.

చనిపోయిన‌ప్పుడు దిశా మృత‌దేహంగా న‌గ్నంగా ఉందంటూ కొంద‌రు ఆరోప‌ణ‌లు చేయ‌గా, దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన ముంబై పోలీస్ అధికారి .. మ‌ర‌ణించే స‌మ‌యంలో దిశా పూర్తిగా దుస్తులు ధ‌రించింది. పంచ‌నామా సిద్ధం చేయ‌డానికి ముందు ఆమెకి అయిన గాయాల‌ని పరిశీలించాల్సి వ‌చ్చింది. అందుకే ఆమె బ‌ట్ట‌లు తొల‌గించాల్సి వ‌చ్చింది. శ‌రీరాన్ని పూర్తిగా ప‌రిశీలించిన త‌ర్వాతే పంచ‌నామా సిద్ధం చేశాం. ప‌రిశీలించిన త‌ర్వాత పోస్ట్‌మార్టంకి పంప‌బ‌డుత‌న్న క్ర‌మంలో మ‌ళ్ళీ బ‌ట్ట‌లు వేయ‌లేదు. పంచ‌నామా ఆమె కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య‌నే జ‌రిగింది.

పంచ‌నామా చేసేట‌ప్పుడు మ‌గ‌వారికైన‌, ఆడ‌వారికైన బ‌ట్ట‌లు ఉండ‌వు అని పోలీస్ అధికారి చెప్పుకొచ్చాడు. ఇక జూన్ 8న జ‌రిగిన‌న పార్టీలో ఓ రాజ‌కీయ నాయ‌కుడు హాజ‌ర‌య్యాడు అని వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో .. ఏ పార్టీ రాజ‌కీయ నాయ‌కుడు హాజ‌రు కాలేదు. ప్రియుడుతో పాటు న‌లుగురు చిన్న‌నాటి స్నేహితులు ఉన్నారు. ఇక సుశాంత్‌కు త‌న‌కు అక్ర‌మ సంబంధం ఉన్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్తవం అని ఆయ‌న ఖండించారు. 


logo