ఈ భామ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందంటే చాలు..లైకులు, కామెంట్లు వరదలా వస్తుంటాయి. ఒక్క స్టిల్ తోనే నెట్టింట్ల సెగలు రేపడం ఈ బ్యూటీకి సరదా. తరచూ ఏదో ఒక హాట్ స్టిల్ తో నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకీ ఆ హాట్ భామ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. బాలీవుడ్ (Bollywood) సుందరీమణి దిశాపటానీ (Disha Patani). ఈ సైజ్ జీరో సుందరి తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది. దిశాపటానీ సెప్టెంబర్ 25న త్రోబ్యాక్ ఫొటో ఒకటి ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందరితో పంచుకుంది.
గులాబీ రంగు బికినీ ( Pink Bikini)లో దర్శనమిస్తూ..అందరినీ కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తోంది. బీచ్ హాలీడేస్ కు సంబంధించిన స్టిల్ కు సముద్రం, సూర్యుడిని మిస్సవుతున్నానంటూ క్యాప్షన్ గా పెట్టింది. పింక్ బికినీ వేర్ లో ఓ వైపు సూర్యతాపాన్ని, సాగరీతీర అందాలను ఆస్వాదిస్తూ..మరోవైపు నెటిజన్లు, ఫాలోవర్లకు అందాలు ఆరబోసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
దిశాపటానీ ప్రస్తుతం హిందీలో కే టీనా, ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో వరుణ్ తేజ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లోఫర్ లో నటించింది దిశాపటానీ.