గురువారం 28 మే 2020
Cinema - May 01, 2020 , 10:57:54

బ‌న్నీతో మాస్ స్టెప్పులు వేయ‌నున్న లోఫ‌ర్ బ్యూటీ

బ‌న్నీతో మాస్ స్టెప్పులు వేయ‌నున్న లోఫ‌ర్ బ్యూటీ

మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టించిన లోఫ‌ర్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన అందాల భామ దిశా ప‌టానీ. ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ అమ్మ‌డు తాజాగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే దిశాతో చిత్ర బృందం సంప్ర‌దించ‌గా,  అమ్మ‌డు అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. 

పుష్ప సినిమాని సుకుమార్ పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ సేతుప‌తి లేదా బాబీ సింహాల‌లో ఒక‌రు విల‌న్‌గా న‌టించ‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా మ‌రి కొద్ది మంది నార్త్ స్టార్స్ ఇందులో భాగం కానున్న‌ట్టు టాక్. అల్లు అర్జున్ చిత్రంలో లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. బన్ని బర్త్‌డే కానుకగా విడుదలైన టైటిల్‌ పోస్టర్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.


logo