శనివారం 11 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 17:52:35

దిశా, కైరా సెల్ఫీ..సుశాంత్‌ మిస్‌

దిశా, కైరా సెల్ఫీ..సుశాంత్‌ మిస్‌

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం పట్ల అభిమానులతోపాటు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌ కోస్టార్లు అతడు లేని లోటును గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ బయోపిక్‌ ఎంఎస్‌ ధోనీలో దిశాపటానీ, కైరా అద్వానీ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ టైంలో ఈ ఇద్దరు తారలు కలిసి తీసుకున్న త్రో బ్యాక్‌ సెల్ఫీ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అయితే దిశాపటానీ, కైరా అద్వానీతో కలిసి లీడ్‌ రోల్‌ లో నటించిన సుశాంత్‌ ఈ ఫొటోలో లేకపోవడం బాధాకరమైన విషయం. ఎప్పుడూ ముఖం చెరగని చిరునవ్వుతో కనిపించే సుశాంత్‌ ఈ ఫొటో ఫ్రేములో లేకపోవడం అందరికీ బాధ కలిగిస్తోంది. దిశాపటానీ ఏక్‌ విలన్‌ 2, రాధే చిత్రాల్లో నటిస్తోంది. కైరా అద్వానీ షేర్షా చిత్రంలో నటిస్తోంది. 



logo