సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 10:03:19

‘దిశా ఎన్‌కౌంటర్’ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన వ‌ర్మ‌

‘దిశా ఎన్‌కౌంటర్’ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన వ‌ర్మ‌

యథార్థ సంఘటనల నేప‌థ్యంలో సినిమాలు తెర‌కెక్కించ‌డంలో దిట్ట రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇప్ప‌టికే ప‌లు రాజ‌కీయ‌, క్రైం అంశాల‌ని వెండితెరపై హృద్యంగా చూపించిన వ‌ర్మ  2019 నవంబ‌ర్‌లో తెలంగాణ‌లో జ‌రిగిన దిశా అత్యాచార, హత్య సంఘ‌ట‌న నేప‌థ్యంలో దిశా ఎన్‌కౌంట‌ర్ పేరుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన వ‌ర్మ తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ చేశాడు

శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర న‌లుగురు మానవ మృగాలు ఒక యువతిపై అత్యంత పైశాచికంగా దాడి చేసి ఓ యువతిని పొట్టనపెట్టుకోవ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ అత్యాచార, హత్య సంఘ‌ట‌న, ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెర‌కెక్కిస్తున్న ఇంటెన్స్ థ్రిల్ల‌ర్‌ అండ్ ఎమోషనల్‌ సెంటిమెంట్‌తో రూపొందిస్తున్న ‘దిశా ఎన్‌కౌంటర్’ చిత్ర ట్రైల‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైంది. ఇందులో దిశా త‌న బైక్ పార్క్ చేయ‌డం, మృగాళ్లు గాలి తీసేయ‌డం, ఆమెను చంపిన త‌ర్వాత కాల్చేయ‌డం వంటి స‌న్నివేశాల‌ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు వ‌ర్మ‌. ట్రైల‌ర్ మూవీపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు


logo