శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 26, 2020 , 11:11:16

ర‌జ‌నీకాంత్‌‌ వ‌ద్ద‌న్నా కూడా ప్ర‌చారం చేశారు

ర‌జ‌నీకాంత్‌‌ వ‌ద్ద‌న్నా కూడా ప్ర‌చారం చేశారు

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ లైఫ్ స్టైల్ ఎంత సింపుల్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెద్ద‌గా విలాసాలు ఇష్ట‌ప‌డ‌ని రజ‌నీకాంత్ గొప్ప‌ల‌కి కూడా ఏ మాత్రం పోరు. ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభంలో త‌న వంతు బాధ్యత‌గా ఫెప్సీకి రూ.50 లక్ష‌ల విరాళంతో పాటు న‌డిగ‌ర్ సంఘంలోని  వెయ్యి మంది నటీనటులకు నిత్యవసరాల్ని అందిస్తున్నారు.

త‌ను చేస్తున్న స‌హాయ కార్య‌క్ర‌మాల‌కి సంబంధించి ఎక్క‌డ మాట్లాడొద్ద‌ని, మీడియాతో చెప్పి వార్త‌లు రాయించొద్ద‌ని కోరారు ర‌జ‌నీకాంత్‌. కాని ఆయ‌న చేస్తున్న ఇంత పెద్ద స‌హాయాన్ని మేం చెప్ప‌కుండా ఉండ‌లేక‌పోయాం అని ద‌ర్శ‌కుడు పేర‌ర‌సు త‌న ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.

 


logo