శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Cinema - Jul 06, 2020 , 23:28:27

ఎవరికైనా ప్రశ్నించే దమ్ముందా?

ఎవరికైనా ప్రశ్నించే దమ్ముందా?

సినీరంగంలోని వేధింపులు, వివక్ష గురించి గళం విప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని..అయితే ఎంతమంది తనకు మద్దతుగా ముందుకొస్తారో తెలియని సందిగ్ధత ఉందని ఆవేదన వ్యక్తం చేసింది సీనియర్‌ కథానాయిక మీరాచోప్రా. పరిశ్రమలో సుదీర్ఘకాలంగా ఉన్న తనకే ఇబ్బందులు తప్పడం లేదని వ్యాఖ్యానించింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌లో మున్ముందు ఆత్మహత్యలు జరగవని ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించింది. 

సినీతారలు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? జీవితాన్నే పణంగా పెట్టే తీవ్ర నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రేరేపిస్తున్న పరిస్థితులేమిటి? చిత్రసీమలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి? కొందరు దర్శకులు ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలింగ్‌ ఎలా చేస్తున్నారు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాల్ని ఆశిస్తున్నానని మీరాచోప్రా భావోద్వేగంగా స్పందించింది. ‘ఆత్మహత్యకు తెలియని కారణాలు ఎన్నో ఉంటాయి. అవకాశాలు లేకపోవడం వల్లే సూసైడ్‌ చేసుకుంటారనే భావన వుంది. అదొక్కటే నిజం కాదు. ఆత్మాభిమానం భగ్నంకావడం, నమ్మిన విలువలు తృణీకరణకు గురికావడం, మనశ్శాంతి కోల్పోవడం..ఈ కారణాలన్నీ ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. ఇలాంటి విషయాల గురించి ధైర్యంగా గళం విప్పే వారు పరిశ్రమలో ఎంతమంది ఉన్నారు?’ అని ప్రశ్నించింది మీరాచోప్రా.


logo