శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 09, 2020 , 04:03:38

నిధి అన్వేషణ నేపథ్యంలో..

నిధి అన్వేషణ నేపథ్యంలో..

‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన యువ దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె  దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. గ్రామీణ నేపథ్యంలో శిథిలావస్థలో వున్న ఓ గోడపై ఓ కోడీ నిల్చొని వుండగా, ఆ గోడమీద ‘వాంటెడ్‌ డెడ్‌ ఆర్‌ అలైవ్‌' అనే హెడ్డింగ్‌తో ఓ పోస్టర్‌ను అంటించారు. ముఖం కూడా సరిగా కనిపించని ఓ వ్యక్తి ఫోటో కింద రూ.50లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటన కనిపిస్తోంది. ఈ పోస్టర్‌తో అందరిలోనూ ఆసక్తి పెంచాడని అంటోంది చిత్రబృందం.మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్‌ డిసెంబరులో ప్రారంభం కానుంది.