శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 01:04:04

వలస బాధితుల కథ!

వలస బాధితుల కథ!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ కోట్లాది వలస కార్మికుల జీవితాలపై  దర్శకుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం‘వలస’. యెక్కలి రవీంద్రబాబు నిర్మాత. విడుదలకు రెడీగా వున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ ‘ ఏళ్ల తరబడి పనిచేసి తాము నిర్మించిన ఈ నగరాలు కూడా తమవే అనే భావనతో ఉన్న వలస కార్మికులు, చిరు ఉద్యోగులు ఒక్కసారి కరోనా మహమ్మరి వల్ల విధించబడ్డ లాక్‌డౌన్‌తో ఒంటరి వారైపోయారు. ఉపాధి లేక తమ గ్రామాలకి పయనమయ్యారు. వెళ్లడానికి ట్రాన్స్‌పోర్ట్‌ లేకపోవడంతో వారుచేసిన పాదయాత్ర ప్రతి హృదయాన్ని కదిలించింది. ఈ నేపథ్యంలో అత్యంత సహజంగా  ఓ ప్రేమకథను మేళవించి రూపొందిస్తున్న చిత్రమిది. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. తేజు, అనుపోజు, గౌరీ ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి.