శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 16, 2020 , 18:59:41

దర్శకుడు సింగీతం శ్రీనివాస‌రావు కు క‌రోనా

దర్శకుడు సింగీతం శ్రీనివాస‌రావు కు క‌రోనా

చెన్నై : ప్రముఖ సినీ దర్శకులు సింగీతం శ్రీనివాస‌రావు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న బుధ‌వారం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కరోనా ల‌క్ష‌ణాలు కనిపించడంతో సెప్టెంబ‌ర్ 9న చెన్నైలో ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చింద‌ని ,ప్ర‌స్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న‌ట్లు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం(సెప్టెంబ‌ర్ 22) నాటితో ఆయ‌న క్వారంటైన్ గ‌డువు ముగుస్తుంద‌ని తెలిపారు. అయితే అంత‌కు ముందు రోజే ఆయ‌న పుట్టిన‌రోజు కావ‌డం విశేషం. " 65 ఏండ్లుగా నేను పాజిటివ్‌గా ఉన్నా, కానీ డాక్ట‌ర్లు ఇప్పుడు కొత్త‌గా కోవిడ్ పాజిటివ్ అన్నారు ," హోమ్ ఐసోలేష‌న్‌లో భాగంగా ప్ర‌త్యేక గ‌దిలో ఉన్నాన‌ని, ఇది త‌న‌కు హాస్ట‌ల్ రోజుల‌ను గుర్తు చేస్తోందంటూ చ‌మ‌త్క‌రించారు. మాస్కులు పెట్టుకున్నా, భౌతిక దూరం పాటించినా, ఎన్ని జాగ్ర‌త్త‌లు ప‌డ్డా ఆ వైర‌స్ త‌న‌కు సోకింద‌ని" ఆయన తెలిపారు.    ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌నిపేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo