సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 17:53:21

కొడుకును హీరో చేస్తున్న డైరెక్టర్

కొడుకును హీరో చేస్తున్న డైరెక్టర్

తెలుగు సినీ పరిశ్రమలో వారసుల సినీరంగ ప్రవేశం కొత్తేమీ కాదు. ఈ జాబితాలో మరో దర్శకుడి తనయుడు కూడా చేరబోతున్నాడు. ‘శతమానం భవతి’, శ్రీనివాస కల్యాణం, ఎంత మంచివాడవురా విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు దర్శకుడు సతీష్‌ వేగెశ్న. ఈ డైరెక్టర్ త్వరలోనే తన తనయుడిని హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. ఎంత మంచివాడవురా చిత్రం పరాజయం కావడంతో ఏ హీరో సతీష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించలేదు.

ఇక ఎప్పట్నుంచో తన వారసుడిని హీరోగా పరిచయం చేయాలనుకున్న సతీష్‌ తన తదుపరి చిత్రాన్ని కొడుకుతో చేయాలని నిర్ణయించుకున్నాడట. తన సొంత బ్యానర్‌లోనే సతీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.logo