గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 14, 2020 , 19:47:16

అనుష్కకు నామకరణం చేసిన పూరీ

అనుష్కకు  నామకరణం చేసిన పూరీ

కథానాయిక అనుష్క శెట్టి మరో పేరు స్వీటి శెట్టిగా అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ కూడా అసలైన ట్విస్ట్‌ ఏంటంటే.. స్వీటి శెట్టి అనేది అనుష్క  ఒరిజినల్‌ నేమ్‌.   అనుష్క అనేది కేవలం ఆమె స్క్రీన్‌ నేమ్‌ మాత్రమే. అనుష్క సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాల్లో అన్నింట్లో స్వీటి శెట్టి అనే వుంటుందట.

తొలి సినిమా ‘సూపర్‌'కోసం అడిషన్‌కు హాజరైనప్పుడు స్వీటి శెట్టి పేరును అనుష్కగా ఆ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ మార్చాడట. ‘సూపర్‌' చిత్రం తొలిపాట ‘మిల మిల’ పాట రికార్డింగ్‌ సమయంలో సంగీత దర్శకుడు పాట కోసం పిలిపించిన సింగర్స్‌లో ఒక అమ్మాయి తన పేరు అనుష్కగా అని చెప్పడంతో అక్కడున్న పూరీకి ఆ పేరు నచ్చి ‘స్వీటి’కి అనుష్కగా నామకరణం చేశాడు.


logo