పూర్ణ, తేజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యాక్‌డోర్’. కర్రి బాలాజీ దర్శకుడు. బి. శ్రీనివాస్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్రంలోని ‘రారా నన్ను పట్టేసుకుని’ అనే పాటను ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీజర్, పాటలు బాగున్నాయి. సినిమా ద్వారా దర్శకుడు చెప్పబోతున్న పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రణవ్ చక్కటి సంగీతాన్ని అందించారు. సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘తనకన్న వయసులో చిన్నవాడైన ఓ యువకుడితో ఏర్పడిన అనుబంధం ఓ మహిళ జీవితంలో ఎలాంటి కల్లోలాన్ని రేపిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. రొమాన్స్, ప్రేమతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్.