మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Aug 11, 2020 , 21:54:51

దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్యం విషమం

దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్యం విషమం

హైదరాబాద్ : దర్శకుడు, నటుడు నిషికాంత్ కామత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది, హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ దవాఖానలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కామత్ గతంలో లివర్ సిరోసిస్‌తో బాధపడ్డాడు. ఆ వ్యాధి తిరగబెట్టినట్లు సమాచారం. అతని పరిస్థితి విషమంగా ఉండగా వెంటనే దవాఖానలో చేర్చారు.

దృశ్యం, మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాలతో ప్రసిద్ది చెందిని నిషికాంత్.. సాచి ఆత్ ఘరత్ వంటి కొన్ని మరాఠీ చిత్రాలలో కూడా నటించారు. 2005 లో అతిపెద్ద హిట్ గా నిలిచిన మరాఠీ చిత్రం డొంబివాలి ఫాస్ట్‌ కు ఆయన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2006 లో మరాఠీలో ఉత్తమ జాతీయ చలన చిత్రంగా పురస్కారాన్ని పొందింది.

నిషికాంత్ కామత్ 2015 లో విడుదలైన అజయ్ దేవ్‌గన్ నటించిన దృశ్యం సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఈ చిత్రంలో టబు ప్రధాన పాత్రలో నటించింది. 2016 లో విడుదలైన జాన్ అబ్రహం నటించిన రాకీ హ్యాండ్సమ్ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించారు. 


logo