గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Aug 27, 2020 , 21:30:16

రెండోసారి ఆ హీరోయిన్ కే అవ‌కాశం..!

రెండోసారి ఆ హీరోయిన్ కే అవ‌కాశం..!

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది చివ‌ర‌లో షూటింగ్ తిరిగి షురూ కానుంది. 2021 వేస‌విలో చిత్రం విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కొర‌టాల శివ ఓ సినిమాను ప్ర‌క‌టించాడు. 2021 సెకండాఫ్ లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ ప్రాజెక్టును ప్ర‌క‌టించిన‌ప్పటి నుంచి హీరోయిన్  ఎవ‌ర‌నే దానిపై ఫిలింన‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

అయితే కొర‌టాల శివ గ‌తంలో త‌న సినిమాలో న‌టించిన హీరోయిన్ నే రెండోసారి ఈ మూవీలో తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? భ‌ర‌త్ అనే నేను చిత్రంలో మ‌హేశ్ తో క‌లిసి స్టెప్పులేసిన కైరా అద్వానీ. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజ‌ముంద‌నే విష‌యంపై కొర‌టాల అండ్ టీం నుంచి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీత‌ద‌ర్శ‌కుడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.