బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 06, 2020 , 13:09:34

సుశాంత్ కేసు..పోలీసుల ఎదుట హాజరైన బన్సాలీ

సుశాంత్ కేసు..పోలీసుల ఎదుట హాజరైన బన్సాలీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణంపై ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ ఇవాళ బాంద్రా పోలీసుల ఎదుట హాజరయ్యారు. సుశాంత్ కేసులో ఇప్పటికే 27 మందికి పైగా విచారించిన పోలీసులు, డైరెక్టర్ బన్సాలీ స్టేట్ మెంట్ ను తీసుకోనున్నారు. 

ఈ కేసులో బాంద్రా పోలీసులు యశ్ రాజ్ ఫిలింస్ కాస్టింగ్ డైరెక్టర్ శనూ శర్మను కూడా మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శనూ శర్మను బాంద్రా పోలీసులు జూన్ 28న మొదటి దశలో విచారించారు. అంతేకాకుండా నటి కంగనారనౌత్, దర్శకుడు శేఖర్  కపూర్ ను కూడా స్టేట్ మెంట్ తీసుకునేందుకు పోలీసులు పిలిచినట్లు టాక్. శేఖర్ కపూర్ కొన్ని సంవత్సరాల క్రితం సుశాంత్ సింగ్ పాని చిత్రం తీసేందుకు సన్నాహాలు చేశారు. అయితే పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల వల్ల సినిమా మొదలవలేదని శేఖర్ కపూర్ ఇప్పటికే తెలిపారు. జూన్ 14న సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo