ఇప్పుడు ఆయన తీరు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ కుర్ర దర్శకుడు నిజంగానే అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. టాలీవుడ్లో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు చేసిన 5 సినిమాలు విజయం సాధించడంతో అనిల్ రావిపూడి డేట్స్ కోసం నిర్మాతలంతా వేచి చూస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఈయన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనే విషయంలో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.
ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్2 సీక్వెల్ ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నాడు అనిల్. ఈ సినిమా ఇక్కడే ఆగదు.. ఫ్రాంఛైజీలా ముందుకు వెళుతుంది అంటూ ఇదివరకే ప్రకటించాడు అనిల్ రావిపూడి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎవరితో కలిసి పని చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. F3 తర్వాత సినిమా రామ్ చరణ్ తో ఉండబోతుందని మొన్నటివరకు ప్రచారం జరిగింది. అలా కాదు అల్లు అర్జున్ అనిల్ రావిపూడి సినిమా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది.. అనౌన్స్మెంట్ రావడమే తరువాయి అంటూ మరో వార్త సోషల్ మీడియాలో వినిపించింది. ఇవన్నీ కాదు సరిలేరు నీకెవ్వరు తో మహేష్ బాబుకు కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి మరోసారి ఆయన ద్వారా సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం కూడా జరిగింది.
ఇక ఇప్పుడు బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నాడు అంటూ మరో వార్త పుట్టుకొచ్చింది. ఇది కన్ఫామ్ ఖచ్చితంగా ఎఫ్ 3 తర్వాత బాలయ్యతో అనిల్ సినిమా చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో గట్టిగా ప్రచారం జరుగుతుంది. అయితే బాలయ్య మాత్రం తన తర్వాత సినిమా గోపీచంద్ మలినేనితో కమిట్ అయ్యాడు. మరి ఆయన సినిమా పూర్తయ్యేవరకూ అనిల్ అలాగే వేచి ఉంటాడా.. లేదంటే మధ్యలో మరో హీరోతో సినిమా చేస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ కన్ఫ్యూజన్ కు ఒక కంక్లూజన్ రావాలంటే అనిల్ నోరు విప్పాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కంగనా ‘ అష్టమి ప్రసాదం’ పై నెటిజన్ల ట్రోల్స్..!
జబర్దస్త్ లో కరోనా కలకలం..ఇంకా ఎంత మందికి వచ్చింది..?
వకీల్ సాబ్ పై మాజీ న్యాయమూర్తి ప్రశంసల జల్లు
అనిల్‌రావిపూడి కల నెలవేరబోతుందా..?