అజయ్ భూపతి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మూడేళ్ల కింద ఆర్ఎక్స్100 అనే సినిమాతో బాక్సాఫీసు దగ్గర సంచలన విజయం అందుకొన్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాను విజయ్ దేవరకొండ, శర్వానంద్ సహా ఇంకా చాలా మంది హీరోలు వదులుకున్నారు. కథ నచ్చలేదు అంటూ దర్శకుడి మోహమ్మీదే చెప్పారు. అయినా కూడా అజయ్ భూపతి పట్టు వదల్లేదు. కార్తికేయను హీరోగా పెట్టి తాను అనుకున్న కథను అనుకున్నట్లుగా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అజయ్ భూపతి. అంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా రెండో సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు ఈ దర్శకుడు.
రవితేజ హీరోగా ఒక సినిమా మొదలుపెట్టి అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆపేశాడు. ఆ సినిమా ఆగిపోయాక సోషల్ మీడియాలో రవితేజపై అజయ్ భూపతి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అంతేకాదు మరో ఇద్దరు హీరోలు కూడా ఈ దర్శకుడు చెప్పిన కథకు నో చెప్పారు. అదే కథను ఇప్పుడు మహా సముద్రం పేరుతో తెరకెక్కించాడు అజయ్ భూపతి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత దర్శకుడిలో ఉన్న కసి మొత్తం బయటకు కనిపిస్తుంది అంటున్నారు అభిమానులు. తను రాసుకున్న కథపై ప్రేమతో కంటే.. ఆ కథను కాదన్న వాళ్లపై ఉండే కోపంతోనే ఈ సినిమా అజయ్ భూపతి చేసినట్లు అనిపిస్తుంది.
తన మొదటి సినిమా ఎలాగైతే చాలామంది హీరోలు కాదని చెప్పి వదిలేసిన తర్వాత అదే కథతో హిట్ కొట్టాడో.. ఇప్పుడు మహా సముద్రం సినిమా విషయంలో కూడా ఇదే చేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు అజయ్ భూపతి. ట్రైలర్ చూస్తుంటే నిజంగానే అంత విషయం కూడా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు. శర్వానంద్, సిద్ధార్థ్ లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలు పోటాపోటీగా స్క్రీన్‌పై కనిపిస్తుంటే.. జగపతి బాబు, రావు రమేశ్ లాంటి సీనియర్ నటులు వాళ్లకు అండగా నిలబడితే.. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మహా సముద్రం ట్రైలర్ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
సినిమా కూడా ఇంత పకడ్బందీగా ఉంటే కచ్చితంగా అజయ్ భూపతి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయం. అక్టోబర్ 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనూ ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి మహా సముద్రం కానీ విజయం సాధించిందంటే మాత్రం అజయ్ భూపతి లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈయన నమ్మకాన్ని ఆ సినిమా ఎంత వరకు నిలబెడుతుందో చూడాలి. ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
ఇదే కదా నిర్మాతలు కోరుకుంది.. లవ్ స్టోరీ సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ పక్కా..!
Samantha Akkineni | సమంత లవ్‌స్టోరి సినిమా చూడదట!
అనుష్క పెళ్లి విషయంలో జ్యోతిష్కుడు కీలక వ్యాఖ్యలు