శుక్రవారం 27 నవంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 15:04:59

ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ద‌ర్శ‌క‌నిర్మాత‌ మృతి

ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ద‌ర్శ‌క‌నిర్మాత‌ మృతి

ఈ ఏడాది ఇండ‌స్ట్రీలో ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు మృత్యువాత ప‌డ్డారు. వారి మ‌ర‌ణం తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. తాజాగా  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత దినేష్ గాంధీ అనారోగ్యంతో బెంగుళూరు ప్రైవేటు ఆసుప‌త్రిలో చేర‌గా, శ‌నివారం ఉద‌యం గుండెపోటుతో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 52 ఏళ్ళు కాగా, సుదీప్‌ కిచ్చా నటించిన ‘వీర మదకారి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజే దినేష్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

దినేష్ ఆక‌స్మిక క‌ర‌ణం సినీ ఇండ‌స్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. దినేష్ గాంధీ తెర‌కెక్కించిన వీర మ‌దకారి చిత్రం తెలుగులో రౌడీ ఇన్స‌పెక్ట‌ర్ పేరుతో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.