దిల్ రాజు..ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉంటుందో..ఎలాంటి సినిమా తీస్తే మార్కెట్ పరంగా లాభాలు వస్తాయో సరిగ్గా అంచనా వేయగల నిర్మాత. దిల్ రాజు నిర్మాణంలో సినిమా వస్తుందంటే మినమం గ్యారంటీ ఉన్నట్టే. ఇటీవలే పవన్ కల్యాణ్ తో వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దిల్ రాజు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. దిల్ రాజుకు భవిష్యత్ లో పవన్ కల్యాణ్ డేట్స్ కూడా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కోసం ఓ కథ రాయాలని అనిల్ రావిపూడిని కోరినట్టు ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. దిల్ రాజు కోరిక మేరకు అనిల్ రావిపూడి కూడా స్టోరీ రాయడం మొదలుపెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. మరి అనిల్ రావిపూడి ఒకవేళ స్టోరీ రాస్తే పవన్ కోసం ఎలాంటి బ్యాక్ డ్రాప్ పెడతాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!