శనివారం 30 మే 2020
Cinema - May 13, 2020 , 07:59:37

శ్రీమ‌తితో దిల్ రాజు తొలి సెల్ఫీ.. ఫోటో వైర‌ల్

శ్రీమ‌తితో దిల్ రాజు తొలి సెల్ఫీ.. ఫోటో వైర‌ల్

టాలీవుడ్ బ‌డా ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు రెండో వివాహం ఈ ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్‌పల్లిలో ఉన్న‌ వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలోనిరాడంబరంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌కి ఇండ‌స్ట్రీ నుండి అనిల్ రావిపూడి, హ‌రీశ్ శంక‌ర్‌లు హాజ‌రైన‌ట్టు స‌మాచారం. గ‌త రెండు రోజులుగా దిల్ రాజు పెళ్ళి సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా, ఆయ‌న పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి..

దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న అమ్మాయి పేరు తేజ‌స్విని అలియాస్ ఆమె పేరును వైఘా రెడ్డి. ఈమె బంధువుల‌కి సంబంధించిన అమ్మాయి అని కొంద‌రు అంటుండగా, మరి కొంద‌రు బ్రాహ్మ‌ణ యువ‌తి అని చెప్పుకొస్తున్నారు. ఏదేమైన ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా శ్రీమ‌తితో క‌లిసి దిల్ రాజు దిగిన  సెల్ఫీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.  వివాహం అనంతరం వీరిద్ద‌రు దిగిన ఫోటో ఇదే అని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత.. 2017 సంవత్సరంలో అనారోగ్యం కారణంగా మరణించారు. 


logo