గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 10:52:11

శ్రీవారిని ద‌ర్శించుకున్న దిల్ రాజు దంప‌తులు

శ్రీవారిని ద‌ర్శించుకున్న దిల్ రాజు దంప‌తులు

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మంగ‌ళ‌వారం ఉద‌యం వీఐపీ ద‌ర్శ‌న స‌మ‌యంలో త‌న స‌తీమ‌ణి తేజ‌స్వితో క‌లిసి తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశ్వీరచనాలు ఇచ్చారు. పెళ్లి త‌ర్వాత కూడా దిల్ రాజు త‌న భార్య‌తో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న విష‌యం తెలిసిందే.  

మే 10న ఆదివారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్‌పల్లి వెంకటేశ్వర ఆలయంలో దిల్ రాజు తేజస్వినిని (వైఘా రెడ్డి) రెండో వివాహమాడారు. లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా వివాహానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. వరంగల్‌కు చెందిన తేజస్విని కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గతంలో ఆమె ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేశారని సమాచారం. రెండో వివాహం చేసుకున్న దిల్‌రాజుకు ఆయన కుమార్తె హన్షితా రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.