సోమవారం 25 మే 2020
Cinema - Feb 05, 2020 , 11:01:15

పింక్ రీమేక్‌పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!

పింక్ రీమేక్‌పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!

బాలీవుడ్‌లో కోర్ట్ రూమ్ డ్రామా నేప‌థ్యంతో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన చిత్రం పింక్. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు దిల్ రాజు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. సినిమాకి సంబంధించి ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి, మూవీ షూటింగ్‌ ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. మ‌రోవైపు మూవీ టైటిల్‌, రిలీజ్ డేట్, హీరోయిన్‌ల గురించి పుకార్లు పుట్టిస్తున్నారు గాసిప్ రాయుళ్లు. ఈ క్ర‌మంలో కొద్ది రోజులుగా  పింక్ రీమేక్‌ని తెలుగులో లాయ‌ర్ సాబ్ అనే టైటిల్‌తో విడుద‌ల చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, తాజాగా దిల్ రాజు దీనిని ఖండించారు.  ఇంకా సినిమా టైటిల్ ఏమి అనుకోలేదు అని త్వ‌ర‌లో క్లారిటీ ఇస్తామ‌ని అన్నారు. ఉగాది పండుగ రోజు పింక్ తెలుగు రీమేక్ టైటిల్ అనౌన్స్ చేస్తామ‌ని చెప్పిన దిల్ రాజు, మే 15న చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని పేర్కొన్నారు. ఏప్రిల్ నుండి మూవీకి సంబంధించి భారీగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్ట‌నున్నారట‌.


logo