మంగళవారం 07 జూలై 2020
Cinema - May 10, 2020 , 11:01:52

దిల్ రాజు రెండో పెళ్లి అంటూ ప్ర‌చారం..నిజ‌మెంత ?

దిల్ రాజు రెండో పెళ్లి అంటూ ప్ర‌చారం..నిజ‌మెంత ?

స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు పెళ్లికి సంబంధించి గ‌త కొద్ది రోజులుగా అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. తాజాగా మ‌ళ్ళీ దిల్ రాజు పెళ్లిపై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అందుకు కార‌ణం తాజాగా దిల్ రాజు ఓ స్టేట్‌మెంట్ విడుద‌ల చేయ‌డం. కొన్నాళ్ళుగా ప్రపంచంలోని స‌మ‌స్య‌లు, వృతిప‌ర‌మైన ఇబ్బందులు ఎలా ఉన్నాయో అంద‌రికి తెలిసిందే. నా జీవితంలో కూడా వ్య‌క్తిగ‌ల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ని భావిస్తున్నాను. అందుకు అనుగుణంగా కొత్త జీవితాన్ని ప్రారంభించ‌బోతున్నాను అని ప్ర‌క‌టించాడు దిల్ రాజు.

దిల్ రాజు ప్ర‌క‌ట‌న‌తో ఆయ‌న మ‌రో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని ఫిలిం న‌గ‌ర్ వాసులు అంటున్నారు. నిజామాబాద్  వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో ఆదివారం రాత్రి  ఆయ‌న వివాహం చేసుకోనున్నారు అని చెబుతున్నారు. ఈ పెళ్లికి ప‌దిమంది కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌ర‌వుతారని తెలుస్తుంది. కాగా, మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత.. అనారోగ్యంతో  మరణించింది. ఈ ఘటన దిల్ రాజుకిను తీవ్ర బాధను మిగిల్చింది. ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్నారు. మ‌రి ఈ రోజు దిల్ రాజు పెళ్లి జ‌ర‌గ‌నుంద‌నే వార్త‌లో ఎంత నిజ‌ముంద‌నేది చూడాలి.


logo