గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 14:50:33

దిల్‌రాజుకు రూ. 10 కోట్లు తెచ్చిపెట్టిన 'వి' సినిమా

దిల్‌రాజుకు రూ. 10 కోట్లు తెచ్చిపెట్టిన 'వి' సినిమా

ఇటీవ‌ల ఓటీటీలో రిలీజ్ అయినా 'వి' చిత్రానికి మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓవ‌రాల్‌గా సినిమా అభిమానుల‌ను నిరాశ ప‌రిచిన‌ప్ప‌టికీ ఆన్‌లైన్లో రిలీజ్ చేయ‌డం ద్వారా దిల్‌రాజు రూ. 10 కోట్లు లాభం పొందారు. సినిమా స్టోరీ కొత్త‌గా స్టార్ట్ చేసిన త‌ర్వాత అంత రొటీన్‌గా అనిపించ‌డంతో ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింద‌నే చెప్ప‌వ‌చ్చు.

'వి' సినిమాకు బ‌డ్జెట్ 33 కోట్లు ఖ‌ర్చుపెడితే.. ఓటీటీ ద్వారా రూ. 31 కోట్లు వ‌చ్చాయి. శాటిలైట్ రైట్స్ కింద రూ. 8 కోట్లు, డ‌బ్బింగ్ రైట్స్ రూ. 7 కోట్లు తెచ్చిపెట్టింది. ఓటీటీలో రీలీజ్ చేయ‌డంతో ప‌బ్లిసిటీ ఖ‌ర్చు కూడా లేదు. మొత్తానికి నిర్మాత‌కు 10 కోట్లు తెచ్చిపెట్టింది. సినిమాకు వ‌చ్చిన టాక్‌కు థియేట‌ర్‌లో రిలీజ్ చేసి ఉంటే న‌ష్టాలు చూడాల్సి వ‌చ్చేది అంటున్నారు. 


logo