మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 13:25:23

దిల్ బెచారా టైటిల్ ట్రాక్ వీడియో

దిల్ బెచారా టైటిల్ ట్రాక్ వీడియో

కోట్లాదిమంది ఫ్యాన్స్ ని వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ చివ‌రిగా న‌టించిన చిత్రం దిల్ బెచారా. 2014లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా ఈ చిత్రాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛబ్రా తెరకెక్కించాడు.  ఈ సినిమా జూలై 24న ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతోంది. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా దిల్ బెచారా టైటిల్ ట్రాక్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో సుశాంత్ ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ క‌నిపించారు. దాదాపు 2 నిమిషాల 44 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సాంగ్‌ని సింగిల్ టేక్‌లో షూట్ చేశార‌ట‌. ఈ వీడియో చూస్తున్న ఫ్యాన్స్ త‌న అభిమాన హీరో లేర‌నే విష‌యాన్ని న‌మ్మ‌లేక‌పోతున్నారు. ఈ మూవీలో సుశాంత్ జోడిగా సంజన సంఘి నటించగా.. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు.
logo