మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 09:11:31

రికార్డులు క్రియేట్ చేస్తున్న సుశాంత్ మూవీ ట్రైల‌ర్

రికార్డులు క్రియేట్ చేస్తున్న సుశాంత్ మూవీ ట్రైల‌ర్

దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన చివ‌రి చిత్రం దిల్ బేచారా. ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది.  2014లో హాలీవుడ్‌లో విడుద‌లైన రొమాంటిక్ డ్రామా ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ బుక్ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు ముకేష్ ఛబ్రా తెరకెక్కించారు. ఈ సినిమాలో సుశాంత్ సరసన సంజన సంఘి హీరోయిన్‌గా నటించింది. ఇద్ద‌రు క్యాన్స‌ర్ పేషెంట్ల మ‌ధ్య సాగే ప్రేమ క‌థ నేప‌థ్యంలో చిత్రాన్ని రూపొందించారు.

రీసెంట్‌గా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా,  24 గంటలు కూడా గడవక ముందే ట్రైల‌ర్‌ 20 మిలియన్ వ్యూస్ దాటేసింది. అలాగే ఈ ట్రైలర్ కి 4.2 మిలియన్ లైక్స్ రావడం మరో రికార్డ్. తమ అభిమాన హీరో నటించిన చివరి చిత్రం కావడంతో అభిమానులు ట్రైల‌ర్‌ని ట్రెండ్ చేస్తూ త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు.  అవెంజ‌ర్స్‌లో వ‌చ్చిన ఇన్ఫినిటీ వార్‌, ఎండ్ గేమ్ ట్రైల‌ర్ రికార్డ్‌ని దిల్ బెచారా బీట్ చేయ‌డంతో ఫ్యాన్స్ తెగ సంతోష‌ప‌డుతున్నారు ఈ చిత్రం  ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ డ్రామాగా తెలుస్తుంది.  ఏ ఆర్ రెహమాన్ చిత్రానికి  సంగీతం అందించారు.


logo