శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 15, 2021 , 21:53:31

‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?

‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఖాయం. ప్యాండమిక్ కాబట్టి 20 కోట్లు అటూ ఇటూగా ఉంటుదేమో కానీ క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది. కరోనా ఉన్నా.. ఏమున్నా కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే కచ్చితంగా థియేటర్స్ దగ్గర రచ్చ ఆగదని మాస్టర్ సినిమాతో విజయ్.. క్రాక్ సినిమాతో రవితేజ నిరూపించారు. దాంతో నిర్మాతల్లో కూడా నమ్మకం పెరిగిపోయింది. మళ్లీ మునపటి పరిస్థితులు వచ్చేసాయని అంతా ఫిక్స్ అయిపోతున్నారు. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడుకుందామిప్పుడు. 

ఈ చిత్ర టీజర్ విడుదలైన తర్వాత రేంజ్ మరింత పెరిగిపోయింది. అంచనాలు కూడా ఆకాశానికి చేరిపోయాయి. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సినిమా రైట్స్ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ భారీగానే జరుగుతుంది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ జీ తెలుగు భారీ రేట్ పెట్టి కొనేసిందని ప్రచారం జరుగుతుంది. సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు.. హిట్ ఫ్లాప్ సంగతి పక్కనెట్టేసారు.. రైట్స్ మాత్రం ఏకంగా 15 కోట్లకు సొంతం చేసుకున్నారు. అది పవన్ రేంజ్ అంటే అంటూ కాలర్ ఎగరేస్తున్నారు అభిమానులు ఇప్పుడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య పాండే కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 

పవన్ రెమ్యునరేషన్ పక్కనబెడితే వకీల్ సాబ్ బడ్జెట్ 20 కోట్లు కూడా దాటలేదని తెలుస్తుంది. ఈ లెక్కన రైట్స్ రూపంలోనే 80 శాతం పెట్టుబడి వెనక్కి వచ్చేసిందన్నమాట. శాటిలైట్ మాత్రమే 15 కోట్లు ఉంటే.. డిజిటల్, ఓటిటి ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ కలిపితే విడుదలకు ముందే 60 కోట్ల వరకు వకీల్ సాబ్ బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. రేపు సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పవన్ సునామీ మొదలైపోయినట్లే. చూడాలిక.. ఏం జరగనుందో..? మార్చిలో వకీల్ సాబ్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

కృతిస‌న‌న్‌ క‌విత్వానికి నెటిజ‌న్లు ఫిదా

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భాస్ 'స‌లార్' షురూ

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo