మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 09:03:22

బుర‌ద‌లో పంది.. అంటూ సోన‌మ్ ట్వీట్

బుర‌ద‌లో పంది.. అంటూ సోన‌మ్ ట్వీట్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో ప‌రిస్థితులు పూర్తిగా మారాయి. సినీ ప్రముఖులు రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. కొంద‌రు సుశాంత్‌కు త‌మ మ‌ద్దతిస్తుంటే మ‌రి కొంద‌రేమో రియాని స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ ప‌రిణామాల మ‌ధ్య‌లో కంగ‌నా బాలీవుడ్ మాఫియా , నెపోటిజం, డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం, ముంబై పీవోకేని త‌ల‌పిస్తుంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.   

కంగ‌నా చేస్తున్న ట్వీట్స్ పెద్ద దుమారం రేపుతున్న నేప‌థ్యంలో సోన‌మ్ క‌పూర్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  ''ఎప్పుడు కూడా బురదలో పందితో కుస్తీ చేయకూడదు. దాని వల్ల మీకే మురికి అంటుతుంది. దానికి బురద అంటే ఇష్టం'' అనే జార్జ్ బెర్నాండ్ షా కొటేషన్ నేను చాలా రోజుల క్రితం నేర్చుకొన్నాను అంటూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కంగ‌నాను ఉద్దేశించే ట్వీట్ చేసిందా అనే అనుమానాలు నెటిజ‌న్స్‌లో మొద‌ల‌య్యాయి.  ఏదేమైన ఒక్క ట్వీట్‌తో సోన‌మ్ అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకోవ‌డం కొస‌మెరుపు.


logo