శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 20:43:08

మహేష్‌పై, పూరీ సెటైర్ వేశాడా..?

మహేష్‌పై, పూరీ సెటైర్ వేశాడా..?

పోకిరి సినిమాతో మహేష్ కెరీర్‌లో మరపురాని విజయాన్ని అందించాడు పూరి జగన్నాథ్, మహేష్ ఇమేజ్‌ను, మార్కెట్‌ను ఓవర్‌నైట్‌లో మార్చేసిన సినిమా పోకిరి. ఆ తరువాత ఈ ఇద్దరి కలయికలో వచ్చిన జనగణమన యావరేజీ చిత్రంగా నిలిచింది. ఇక ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరి కలయికలో .జనగణమన అనే ప్రాజెక్ట్  చేద్దామని ఇరువురు డిసైడ్ చేసుకున్నారు. అయితే ఈలోపు పూరి జగన్నాథ్ చేసిన కొన్ని సినిమాలు అపజయాలుగా నిలవడంతో మహేష్ ముఖం చాటేశాడు. పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టాడు.  ఇటీవల ఇస్మార్ట్‌శంకర్ విజయం తరువాత ఫామ్‌లోకి వచ్చిన పూరీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ సక్సెస్ వుంటేనే విలువ ఇస్తాడు. అలాంటి వ్యక్తితో  మరోసారి సినిమా చేయాలనే వుద్దేశం లేదని ప్రకటించాడు.

అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు అనిపిస్తుంది. పూరీ జగన్నాథ్ జన్మదిన సందర్భంగా నాకు ఇష్టమైన దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ మహేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, మీరు నాకు జన్మదిన శుభాకాంక్షలు అందజేయడం ఆనందంగా వుంది అంటూ పూరి జగన్నాథ్   మహేష్‌కు రిప్లయ్ పంపాడు. అయితే ఇది పరోక్షంగా మహేష్‌పై పూరీ సంధించిన సెటైర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.