శనివారం 30 మే 2020
Cinema - Apr 28, 2020 , 08:46:36

పిండిలో నోట్లు పెట్టి పంచింది అమీర్ ఖానా ?

పిండిలో నోట్లు పెట్టి పంచింది అమీర్ ఖానా ?

క‌రోనా సంక్షోభం వ‌ల‌న నిరాశ్ర‌యులైన వారికి ప‌లువురు ప్ర‌ముఖులు వివిధ  రూపాల‌లో విరాళాలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమా ఇండ‌స్ట్రీ నుండి కూడా చాలా మంది సెల‌బ్రిటీలు త‌మ వంతు విరాళాలు అందించారు. అయితే ఇందులో అమీర్ ఖాన్ త‌న సామాజిక సేవ‌ను బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌కుండా కాస్త వినూత్నంగా చేసాడ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుంది.

ఏప్రిల్ 23న ఢిల్లీలోని నిరుపేద ప్రాంతానికి ఓ ట్ర‌క్ వ‌చ్చి ఆగింది. ఆ వాహనం నిండా గోధుమ పిండితో కూడిన సంచులు ఉన్నాయి. అవ‌స‌ర‌మైన వారికి ఆ సంచుల‌ని పంపిణీ చేసేందుకు టీం సిద్ధ‌మ‌య్యారు. అయితే చాలా మంది ఆ ప్యాకెట్స్ తీసుకోవ‌డానికి నిరాక‌రించారు. అందుకు కార‌ణం ఒక కిలో గోధుమ పిండి త‌మ కుటుంబానికి ఏ మాత్రం స‌రిపోద‌ని వారు అనుకున్నారు. అయితే సంచులు తీసుకున్న‌వారు ఓపెన్ చేసి చూస్తే ప్ర‌తి ప్యాకెట్‌లో రూ. 15 వేలు ఉన్న‌ట్టు గ్ర‌హించారు. 

పేద‌ల‌కి మాత్ర‌మే త‌న సాయం చేరేలా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఇలా ప్లాన్ చేశాడ‌ని అంటున్నారు. నిజంగా అవ‌స‌రం ఉన్న వారు మాత్ర‌మేఏ కిలో గోధుమ పిండి కోసం క్యూలో ఉంటారు. వారికి అందులో దాచి ఉంచిన న‌గ‌దు కూడా అందుతుంద‌ని ఆయ‌న బావించిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ గోధుమ పిండి ప్యాకెట్ల‌ని పంచింది అమీర్ ఖాన్ అని జోరుగా ప్ర‌చారం నేప‌థ్యంలో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎప్పుడు స్పందిస్తాడా అని అంద‌రు ఎదురు చూస్తున్నారు 


logo