ఆదివారం 31 మే 2020
Cinema - May 07, 2020 , 18:21:21

రెండోసారి ‘యునెప్’ గుడ్ విల్ అంబాసిడ‌ర్ గా దియామీర్జా

రెండోసారి ‘యునెప్’ గుడ్ విల్ అంబాసిడ‌ర్ గా దియామీర్జా

బాలీవుడ్ న‌టి దియా మీర్జా యునైటెడ్ నేష‌న్స్ ఎన్విరాన్ మెంట్ ప్రోగ్రామ్ (యునెప్‌) జాతీయ గుడ్ విల్ అంబాసిడ‌ర్ గా రెండోసారి నియ‌మితుల‌య్యారు. దియామీర్జా 2022 ముగిసేవ‌ర‌కు గుడ్ వి‌ల్ అంబాసిడర్ గా కొన‌సాగనున్న‌ట్లు యునైటెడ్ నేష‌న్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

పర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌ల‌పై అవ‌గ‌హ‌న క‌ల్పించడంలో దియా మీర్జా చేస్తున్న సేవ‌ల‌ను ప్ర‌శంసిస్తూ..యూఎన్ మ‌రోసారి ఆమెను గుడ్ విల్ అంబాసిడ‌ర్ గా నియ‌మించింది. యునెప్ నేష‌న‌ల్ గుడ్ విల్ అంబాసిడ‌ర్ గా దియామీర్జా సేవ‌లు కొన‌సాగ‌డం ఆనందంగా ఉంద‌ని యునెప్ ఆసియా, ప‌సిఫిక్ రీజిన‌ల్ డైరెక్ట‌ర్ డెచెణ్ సెరింగ్ తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo