సంకేత్, తిరుమనీడి, మోనిక చౌహాన్ నాయకానాయికలుగా నాగ్ ముంత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మచక్రం’ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పద్మ నారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై జీపీ రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి వరుణ్ క్లాప్‌నివ్వగా, రాజశేఖర్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సమాజంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయల్ని ప్రశ్నించే కథాంశమిది. ఆడవాళ్లు స్వీయ రక్షణ ఎలా చేసుకోవాలో తెలియజేస్తుంది. సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ సినిమాలో తాను ద్విపాత్రాభినయంలో నటిస్తున్నానని హీరోయిన్ మోనిక చెప్పింది. చక్కటి సందేశాత్మక చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని హీరో సంకేత్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఆనంద్, సంగీతం: ప్రణయ్ రాజపుటి, దర్శకత్వం: నాగ్ ముంత.