శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 15:29:33

డ్ర‌గ్స్ కేసు.. ధ‌ర్మ ప్రొడక్ష‌న్స్ ప్రొడ్యూస‌ర్ అరెస్టు

డ్ర‌గ్స్ కేసు.. ధ‌ర్మ ప్రొడక్ష‌న్స్ ప్రొడ్యూస‌ర్ అరెస్టు

హైద‌రాబాద్:  బాలీవుడ్ హీరోయిన్ల చుట్టు తిరుగుతున్న డ్ర‌గ్స్ కేసులో ఇవాళ మ‌రో మ‌లుపు తీసుకున్న‌ది.  డ్ర‌గ్స్ కేసులో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ కిటిజ్‌ ర‌విప్ర‌సాద్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసును ఎన్సీబీ విచారిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ కేసులో భాగంగా ర‌విప్ర‌సాద్‌ను కూడా శుక్ర‌వారం విచారించారు. ఇవాళ కిటిజ్‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ఎన్సీబీ అధికారులు చెప్పారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న విచార‌ణ‌లో ర‌విప్ర‌సాద్ పేరును వెల్ల‌డించిన‌ట్లు కూడా తెలుస్తోంది. దీపిక్ ప‌దుకొణే, శ్ర‌ద్ధాక‌పూర్‌ల‌ను ఇవాళ విచారిస్తున్నారు. 

అయితే ధ‌ర్మ ప్రొడెక్ష‌న్స్ అధినేత క‌ర‌ణ్ జోహార్ శుక్ర‌వారం డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు.  ర‌విప్ర‌సాద్‌తో త‌న‌కు ప‌రిచ‌యం లేద‌ని, వ్య‌క్తిగ‌తంగా అత‌ను త‌న‌కు తెలియ‌ద‌ని క‌ర‌ణ్ పేర్కొన్నారు. త‌న ఇంట్లో కూడా ఎటువంటి డ్ర‌గ్స్ పార్టీ జ‌ర‌గ‌లేద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ధ‌ర్మ ప్రొడెక్ష‌న్స్‌తో సంబంధం ఉన్న ధ‌ర్మాటిక్ ఎంట‌ర్‌టైన్మెంట్‌లో ర‌విప్ర‌సాద్ 2019 న‌వంబ‌ర్‌లో చేరారు. డ్ర‌గ్స్ స్పెష‌లిస్టు ఆఫీస‌ర్ స‌మీర్ వాంఖ‌డే శ‌నివారం ర‌విప్ర‌సాద్‌ను విచారించారు. దాని త‌ర్వాత‌నే అత‌న్ని అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. ర‌వి ప్ర‌సాద్ త‌న విచార‌ణ‌లో అయిదుగురు బాలీవుడ్ సెల‌బ్రిటీల పేర్ల‌ను, మ‌రో ఇద్ద‌రు ప్రొడ్యూస‌ర్ల పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టన‌ట్లు ఎన్సీబీ వ‌ర్గాల ద్వారా తెలుస్తున్న‌ది. logo