సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 00:12:41

ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌!

ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌!

‘హుషారు’ ఫేమ్‌ దినేష్‌తేజ్‌, శ్వేతా అవస్తీ జంటగా కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ పతాకంపై పవన్‌కుమార్‌ దర్శకత్వంలో వెంకటేష్‌ కొత్తూరి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘ కామెడీ, లవ్‌, ఎమోషన్స్‌ అన్ని సమపాళ్లలో మేళవించి జనరంజకంగా వుండే విధంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అని తెలిపారు. 


logo