e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News ధ‌నుష్ ఎంట్రీ టాలీవుడ్ హీరోల‌కు చెక్ పెట్టేందుకేనా..?

ధ‌నుష్ ఎంట్రీ టాలీవుడ్ హీరోల‌కు చెక్ పెట్టేందుకేనా..?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో కొంత‌మందికి ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాలతోపాటు త‌మిళ‌నాడులో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. అయితే అజిత్‌, విజ‌య్‌, సూర్య, విక్ర‌మ్ లాంటి స్టార్ హీరోలు డ‌బ్బింగ్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్ ను ఎంట‌ర్ టైన్ చేసినా..డైరెక్ట్ తెలుగు సినిమా చేయ‌డంలో మాత్రం స‌క్సెస్ కాలేక‌పోయారు. వీరితోపాటు శింబు, జీవా, శివ‌కార్తికేయ‌న్ తెలుగు సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మయ్యారు. అయితే మ‌రో హీరో కార్తీ విష‌యంలో మాత్రం కొంత మిన‌హాయింపునివ్వ‌చ్చు. ఇప్ప‌టికే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు కార్తీ.

ఇక ఇప్పుడేమో అంద‌రి అంచ‌నాల‌ను అధిగ‌మిస్తానంటూ ధ‌నుష్ టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శేఖ‌ర్ క‌మ్ముల‌తో క‌లిసి టాలీవుడ్ నిర్మాత‌లు ధ‌నుష్ ను తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌ట్టుకొస్తున్నారు. కోలీవుడ్ లో బిజీగా లేక‌పోవ‌డంతో తెలుగు వైపు అడుగులు వేస్తున్నాడ‌నుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే. ధ‌నుష్ ఇప్ప‌టికే బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. మ‌రి టాలీవుడ్ కు ఎందుకు రాకూడ‌ద‌ని కొంద‌రు నిర్మాత‌లు భావించార‌ట‌.

- Advertisement -

తెలుగు సినిమా చేయాల‌నేది ధ‌నుష్ కోరిక కాక‌పోయినా..కొంత‌మంది నిర్మాత‌లే అత‌డిని ఇక్క‌డికి తీసుకొస్తున్నార‌న్న టాక్ ఫిలింన‌గ‌ర్ లో జోరుగా న‌డుస్తోంది. దీనిక్కార‌ణం కూడా ఉంది. ప్ర‌స్తుతం స‌క్సెస్, ఫెయిల్యూర్, మార్కెట్‌ కు సంబంధం లేకుండా కొందరు టాలీవుడ్ హీరోలు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో అస్స‌లు త‌గ్గ‌డం లేదు. మ‌రోవైపు మేమేం త‌క్కువ కాదంటూ మిడ్ రేంజ్ హీరోలు కూడా పారితోషికాన్ని రెట్టింపు చేస్తున్నారు. దీంతో సినిమాలు హిట్ట‌యిన‌ప్ప‌టికీ నిర్మాత‌ల‌కు ఆశించిన ఫ‌లితాలు రావ‌డం లేదు. అందుకే ఇక్క‌డి హీరోల డిమాండ్ కు చెక్ పెట్టే ఉద్దేశంతో నిర్మాత‌లు ధ‌నుష్ తో టాలీవుడ్ వైపు అడుగులు వేయిస్తున్నార‌న్న టాక్ ఉంది.

ధ‌నుష్ ప్రొడ్యూస‌ర్ ఫ్రెండ్లీ వ్య‌క్తి కావ‌డం, ధ‌నుష్ సినిమాల‌కు మంచి క్రేజ్ ఉండ‌టం, భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌టం లాంటి అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాత‌లు ధ‌నుష్ అయితేనే తెలుగు ఇండ‌స్ట్రీ హీరోల‌పై ప్ర‌భావం చూపిస్తాడ‌ని ఫిక్స్ అయ్యార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. స్టార్ డ‌మ్ ప‌క్క‌న పెట్టి కంటెంట్ ఓరియెంటెడ్‌, డీగ్లామ‌రైజ్ డ్ పాత్ర‌లు చేసే విష‌యంలో టాలీవుడ్ స్టార్ హీరోలు కొంత వెనుక‌బ‌డి ఉంటార‌నే చెప్పాలి. మ‌రి ధ‌నుష్ మంత్రం రాబోయే కాలంలో టాలీవుడ్ పై ఎలా ప‌ని చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

త‌గ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!

డేటింగ్ లో సారా అలీఖాన్..అత‌డెవ‌రో తెలుసా…?

కొత్తింట్లోకి ‘రాఖీభాయ్‌’..ఫొటోలు వైర‌ల్‌

రోజుకు ఎన్ని సిగ‌రెట్లు తాగుతారు..ర‌ష్మిక‌కు అభిమాని ప్ర‌శ్న‌

నాలో మూడు మార్పులొచ్చాయి : స‌మంత‌

వెకేష‌న్ డేస్‌ను గుర్తు చేసుకున్న ర‌కుల్‌..స్టిల్స్ వైర‌ల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana