e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News అఫీషియ‌ల్: ధ‌నుష్‌తో శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం

అఫీషియ‌ల్: ధ‌నుష్‌తో శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం

అఫీషియ‌ల్: ధ‌నుష్‌తో శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం

త‌మిళ హీరోలు టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌పై ఫోక‌స్ పెట్టారు. మ‌న ద‌ర్శ‌కులు విభిన్న క‌థా చిత్రాలు చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న నేప‌థ్యంలో త‌మిళ స్టార్ హీరోలు విజ‌య్, విజ‌య్ సేతుప‌తి, ధ‌నుష్ స్ట్రైట్ తెలుగు సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధ‌నుష్ హీరోగా ఏషియన్ వారు ఓ ప్రాజెక్ట్ సెట్ చేసారు. తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో ట్రైలింగ్యువ‌ల్ మూవీగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.క్లాస్ డైరెక్టర్‌తో రా అండ్ రస్టిక్‌గా సినిమాలు చేస్తూ వెళుతున్న ధనుష్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడా అని అందరు ఎదురు చూస్తున్నారు.

రెండు నేష‌న‌ల్ అవార్డ్స్ అందుకున్న ధ‌నుష్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గానే కాక గ్లోబ‌ల్ స్టార్‌గా స‌త్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు. ధనుష్ ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో ‘ది గ్రేమ్యాన్‌’ లో నటిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మ‌రోవైపు ధ‌నుష్ న‌టించిన “జగమే తందిరం” చిత్రం ఈ రోజు మ‌ధ్యాహ్నాం డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. ఇక శేఖర్ క‌మ్ముల విష‌యానికి వ‌స్తే ఆయ‌న తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరీ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అఫీషియ‌ల్: ధ‌నుష్‌తో శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం
అఫీషియ‌ల్: ధ‌నుష్‌తో శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం
అఫీషియ‌ల్: ధ‌నుష్‌తో శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం

ట్రెండింగ్‌

Advertisement